Wednesday, January 25, 2012

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు...

కోట్లకు పైగా జనాభా ఉన్న భారత దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు...

మనస్పూర్తిగా చెప్పుదామంటే, మాటలు రావట్లేదు, ఏదో అందరూ చెప్తున్నారు కదా అని నేను కూడా చెప్తున్నా.(ఇలా నిజాలు రాస్తున్నందుకు క్షమించండి) . అసలు ఎందుకు చెప్పాలో కాస్త సెలవిస్తారా మిత్రులారా??
ఒక పక్క అవినీతి మహమ్మారి దేశ నలుమూలల వ్యాపించినందుకా?? మరో పక్క వ్యక్తిస్వామ్యమే పరమావధిగా మన ప్రజాస్వామ్యం మారినందుకా?? లేక స్వయానా రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ విగ్రహాలను కూలదోసినందుకా..?? పేద ధనిక వర్గాల మధ్య అంతరం మరింత పెరిగినందుకా?? లేక రాజ్యాంగం లో చిన్న రాష్ట్రాల ఏర్పాటు గురించి స్పష్టం గా చెప్పినా, ఎన్నో పోరాటాలు చేస్తూ ప్రానాలర్పిస్తున్నా, పట్టించుకోని ప్రభుత్వం పాలిస్తున్నందుకా ,...?? సమస్య అంటూ లేని రాష్ట్రమే లేని దేశాన్ని చూసి గొప్పగా ఫీల్ అవ్వాలా?? ప్రజా క్షేమాన్ని పట్టించుకోని ఈ ప్రభుత్వాలను చూసి గర్వంగా చెప్పాలా?? కుల వ్యవస్తను చూసి మురిసిపోవాలా??
భారతీయుడనని గర్వపడాలా లేక ఇవన్నింటిని చూస్తూ మరెలా ఫీల్ అవ్వాలి ??
పేరు గొప్ప ఊరు దిబ్బ.. అంటే ఒప్పుకుంటారా మీరు..??
ఏది ఏమైనప్పటికీ, మీకందరికీ గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు.. మనస్పూర్తిగా (...!!!)

No comments: