Saturday, January 7, 2012

బలిదానాలు చేసుకోవడమే కాదు బలి తీసుకోవడం కూడా మాకు తెలుసు

బలిదానాలు చేసుకోవడమే కాదు బలి తీసుకోవడం కూడా మాకు
సమైక్య ఆంధ్ర ఉద్యమం అంటూ
సంకలు గుద్దుకుంటున్న ఆంధ్ర నాయకులారా
ఏముంది మీ ఉద్యమం లో
సమైక్య ఆంధ్ర అంటూ మీతో వచ్చినోల్లు ఎంత మంది
సమైక్య ఆంధ్ర కోసం మీలో సచ్చినోళ్ళు ఎంత మంది
అధికారంతో నిండిన అహంకారం
పచ్చ నోట్లతో పుట్టుకొచ్చిన పిచ్చిఉద్యమం తప్ప
యుద్ధం అంటే మా తెలంగాణ ది
నీజాం నిరంకుశత్వం నడ్డి విరిచిన మాది యుద్ధం అంటే
మా యుద్ధం లో …….
ఒక్క దొడ్డి కొమురయ్య
ఒక్క గొట్టిముక్కుల గోపాల్ రెడ్డి
ఒక్క రేణిగుంట రాంరెడ్డి
మరెందరో అమరులు ఉన్నారు

పోరాటం పోరాటం అంటూ పోర్లు దండాలు పెడుతున్న ఆంధ్ర నాయకులారా
ఏముంది మీ పోరాటం లో
లగడపాటి లంగేశాలు
నన్నపనేని నోదుటి ముద్దులు తప్ప
పోరాటం అంటే మాది
మా చరిత్రలో
సాయుధ రైతాంగ పోరాటాముంది
మంటల్లో కాలుతున్న మారుమ్రోగిన తెలంగాణ నినాదం ఉంది
లాటీలు,తూటాలు తగిలిన తగ్గని వేడి ఉంది
త్యాగాలు మావి అని తెగ చించుకుంటున్న ఆంధ్ర నాయకులారా
ఏముంది మీ త్యాగాల చరిత్ర లో
ఒక్క పొట్టి శ్రీరాములు తప్ప
త్యాగాలు అంటే మావి
తెలంగాణ విముక్తి కోసం ప్రాణాలర్పించిన నాటి నాలుగు వేల మందివి
ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన నేటి నాలుగు వందల మందివి
మా త్యగాలలో ………
బైరాన్ పల్లి చవులు ఉన్నాయి
భవిష్యత్తును చేజార్చుకున్న జీవితాలున్నాయి
నేల రాలిన విద్య కుసుమాలు ఉన్నాయి
బలుపు ఆరాటాలు మీవి
బలిధాన పోరాటాలు మావి
మీ కోసం మందిని బలి తీసుకునేది మీరు
మంది కోసం బలిదానాలు చేసుకొనేది మేము
మా బలిధనాలలో
ఒక్క శ్రికంతచారి
ఒక్క యాదయ్య
ఒక్క సుజాత
ఒక్క ప్రశాంత్ రెడ్డి
ఎంతో మంది అమరులున్నారు

మానవత్వం లేని నాయకులారా ఇకనైనా మారండి
లేకుంటే
బలిదానాలు చేసుకోవడమే కాదు
బలి తీసుకోవడం కూడా మాకు తెలుసు
మా నెత్తురు లో వేడి ఉంది
మా చేతల్లో వాడి ఉంది
మా కన్నిటిలో నిజం ఉంది
మా పోరాటం లో అర్ధం ఉంది
మీ చరిత్ర లో ఏముంది చదలు పట్టిన గతం తప్ప
ఎంత వెతికినా దొరకనిది మీ చరిత్ర
ఎంత రాసిన ఒడువంది మా చరిత్ర

జై తెలంగాణ జై జై తెలంగాణ

No comments: