Friday, December 9, 2011

నా కళ్ళకు ఎంత ఆశొ....

నువ్వు కనబడవని తెలిసినా వెదుకుతున్నాయి.....

నా కాళ్ళకు ఎంత తొందరొ....

నువ్వు దొరకవని తెలిసిన పరుగులు తీస్తున్నాయి...

నా మనసుకు ఎంత ఆత్రుతొ...

నువ్వు దక్కవని తెలిసినా ఆలొచిస్తుంది...

కాని ఏమి చెయ్యను....

నన్ను బ్రతికిస్తుంది... ఏప్పటికైనా నువ్వు ప్రేమిస్తావనే ఆశే..

**********************************************

దూరంగా వెళ్ళమన్నావుగా...నీ జ్ఞాపకాలను నాకు తోడిచ్చి....
భారంగా బ్రతకమన్నావుగా....మౌనంగా బదులిచ్చి....!
అలాగే కానీ.....నీ ఇష్టమే నా ఇష్టం...!
ఎందుకంటే, "నా" అన్నదేదీ లేదు....అంతా నువ్వు....నా అంతే..నువ్వు మరి...!



********************************************


నా మాటలని, మౌనాన్ని "మరోలా" అర్ధం చేసుకుంటారు జనాలు....!అంటే, వాళ్ళకి 'అసలు' అర్ధం తెలుసా అని...'మరోలా' అర్ధం చేసుకోవడానికి....? అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి....ప్చ్...!

నీ కంటిలో చెమ్మ నా చూపు దాటిపోలేదు....అమ్మ.

అమ్మ.

అమ్మ.
నీ చూపుడు వేలును,
నా పిడికిలి నిండా బిగించి,
భద్రంగా నడిచాను,
ఆ భద్రత మాటున,
నీ దిశానిర్ధేశపు బరోసా,
బ్రతుకంతా బంగారు బాటను వేసింది.
నువ్వు ఏర్పరిచిన ఈ నా బాటలో,
కొంత దూరం నడిపించాక,
మెలమెల్లగా, అతిసున్నితంగా,
నాకే తెలినంత సౌఖ్యంగా,
నీ చూపుడు వేలును విడిపించుకుని,
నన్నలా చూస్తూ ఆగిపోయవు,
కాస్త దూరం వెళ్ళాక కానీ,
గ్రహించుకోలేదు నువ్వు నా పక్కన లేవని,
వెనక్కి తిరిగి చుస్తే,
ఆమడ దూరంలో ఆగిపోయిన నువ్వు,
చిరునవ్వుతో చెయ్యెత్తి సంజ్ఞ చేసావు సాగిపొమ్మని.
అమ్మ. ......
నీ కంటిలో చెమ్మ నా చూపు దాటిపోలేదు....