Friday, December 9, 2011

నీ కంటిలో చెమ్మ నా చూపు దాటిపోలేదు....అమ్మ.

అమ్మ.

అమ్మ.
నీ చూపుడు వేలును,
నా పిడికిలి నిండా బిగించి,
భద్రంగా నడిచాను,
ఆ భద్రత మాటున,
నీ దిశానిర్ధేశపు బరోసా,
బ్రతుకంతా బంగారు బాటను వేసింది.
నువ్వు ఏర్పరిచిన ఈ నా బాటలో,
కొంత దూరం నడిపించాక,
మెలమెల్లగా, అతిసున్నితంగా,
నాకే తెలినంత సౌఖ్యంగా,
నీ చూపుడు వేలును విడిపించుకుని,
నన్నలా చూస్తూ ఆగిపోయవు,
కాస్త దూరం వెళ్ళాక కానీ,
గ్రహించుకోలేదు నువ్వు నా పక్కన లేవని,
వెనక్కి తిరిగి చుస్తే,
ఆమడ దూరంలో ఆగిపోయిన నువ్వు,
చిరునవ్వుతో చెయ్యెత్తి సంజ్ఞ చేసావు సాగిపొమ్మని.
అమ్మ. ......
నీ కంటిలో చెమ్మ నా చూపు దాటిపోలేదు....

No comments: