జీవితపు చివరి అంఖంలో ఆఖరి ఘడియల్లో వున్నాం జరిగిన కాలాన్ని జ్ఞాపకాలుగా కరిగిస్తూ విలువైన క్షణాల కోసం వెతుకుతున్నాం ముడుతలపడ్డ కళ్ళలో భాద్యతల బరువులే అన్నీ ..!చెప్పడానికి కడుపున పుట్టిన పిల్లలు వున్నాఇప్పుడు ఇద్దరమే మిగిలాం ఒకరికి ఒకరు తోడుగా పలకరించే వారే కరువై ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ..!టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న రోజులివి కాలయంత్రం ఎవరైనా కనిపెడితే ఒక్కసారి మా కాలంలోకి వెళ్ళాలనుందిమా అమ్మ నాన్నలకి మేము రాసిన ఉత్తరాలు చదువుకుంటూ ఎలా వున్నారని పలకరించే తీరికేలేని మా బిడ్డలకు దూరంగా ..! @ బాటసారి.